కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి 

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి 

కొండమల్లేపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు

కొండమల్లేపల్లి, : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపుమేరకు ఈరోజు కొండమల్లేపల్లి లోని MPDO ఆఫీస్ నందు ప్రజావాణిలో ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ కొండమల్లేపల్లి నాయకులు MPDO గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 33 నెలలు 1000 రోజులు గడుస్తున్న ప్రజలకు అనాడు అధికారం కోసం అడ్డగోలుగా 420 హామీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మభ్యపెట్టి గద్దెనెక్కినంక ఇచ్చిన హామీలను పక్కనపెట్టి వారి జల్సాల కోసం మంత్రులు హెలికాప్టర్లు తిరగడం కోసం ఎమ్మెల్యేలు దోచుకోవడం కోసం అన్న చందంగా మారి ఇయ్యాల ప్రజాపాలన గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు బంధువు అయితే ఏమి రైతు బీమా ఎగగొట్టి కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ గాలికి వదిలేసి వృద్యాప పించను కావచ్చు వికలాంగుల పింఛన్ కావచ్చు నేటి వరకు అమలు చేయకుండా గ్యాస్ 500 రాయితీ అన్నారు ఇప్పటివరకు అది అమలు కావడం లేదు ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించలేక కరెంట్ సౌకర్యం లేక సాగునీరు తాగునీరు అందించలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఈరోజు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ వెళ్తే అసెంబ్లీ లోనికి రానివ్వకుండా అసెంబ్లీకి వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలకు చెప్పే సమాధానం లేక అసెంబ్లీ గేట్ దగ్గరనే మన నాయకులు అడ్డుకోవడం మా మహిళ శాసనసభ సభ్యురాలు చీరలాగడము మా నాయకుడు ప్రతిపక్ష నేత హరీష్ రావు గారిని మీద చేయి చేసుకోవడం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేసుకోవడం మా జిల్లా నాయకులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని తోసేయడం ఇది హేనమైన చర్యగా భావిస్తూ చేతగాని ప్రభుత్వం వెంటనే మా నాయకులకు క్షమాపణ చెప్పాలని ప్రజలకి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని నిన్ను గద్దె దింపేంత వరకు ప్రజలు తరిమి తరిమి కొడతారని సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రైతు సమితి అధ్యక్షులు  కేసాని లింగారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రామావత్ దస్రు నాయక్,తులసి రామ్,పెద్దిశెట్టి సత్యం, లింగం, అందుగుల వెంకటయ్య,మూడవత్ జగ్రు నాయక్,షేక్ ఇస్మాయిల్,కిరణ్, పాండు,రాజేష్,హబీబ్, బోడ యాదగిరి, ఇస్లావత్ గోవిందు, చింటూ, శంకర్ నాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం  తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
గంభీరావుపేట  గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా మంగళవారం  హమారీ అంగన్వాడి హమారీ జిమ్మధారి  10...
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు 
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి 
దేవరకొండలో ఘనంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవ'  వేడుకలు