13వ వార్డులో వినాయక మండపాన్ని దర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో భీమా యూత్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, స్థానిక కౌన్సిలర్ మర్కంటి భాగ్యలక్ష్మి కనకసేనతో కలిసి మంగళవారం ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మాట్లాడుతూ భీమా యూత్ సభ్యులు ప్రతీ ఏటా ఎంతో ఉత్సాహంతో వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిం చడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ ఐక్యతతో, సంతోషంగా భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపాలిటీ తరఫున అవసరమై న అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమా యూత్ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


