మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ
పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం మరియు వినాయక్ చౌక్ గోపాలకృష్ణ మఠం ముందర మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ , మున్సిపల్ సిబ్బంది పాల్గొని ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించడం వల్ల నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ఆదిలాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని చైర్‌పర్సన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ , డిఎంసి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న , మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


