బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు సువర్ణావకాశం
- సెప్టెంబర్ 1 నుంచి ఓవర్సీస్ విద్యానిధి దరఖాస్తులు
- 350 మంది విద్యార్థులకు అవకాశం.. సెప్టెంబర్ 30తో ముగింపు
- అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: శ్రీనివాస్ రెడ్డి
అక్కన్నపేట, : విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా మరోసారి సువర్ణావకాశం కల్పిస్తోందని ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అర్హతలు ఇవే..దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తు సమయంలో వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. GREలో 260 లేదా GMATలో 500 స్కోర్‌తో పాటు TOEFLలో 60, IELTSలో 6.0 లేదా PTEలో 50 స్కోర్‌లలో ఏదో ఒకటి కలిగి ఉండాలి.అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


