ఎంసీపీఐ(సీ) కేంద్ర కమిటీలో తెలంగాణకు కీలక స్థానం

ఎంసీపీఐ(సీ) కేంద్ర కమిటీలో తెలంగాణకు కీలక స్థానం

లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పొలిట్‌బ్యూరోలో చోటు
23 మందితో నూతన కేంద్ర కమిటీ ఏర్పాటు.. 7 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు
డిసెంబరులో బీహార్ సమావేశాల్లో మిగతా కమిటీ పూర్తి

అక్కన్నపేట, : భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (క్లాస్ స్ట్రగుల్) ఎంసీపీఐ(సీ) కేంద్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని హోటల్ స్వప్న కాన్ఫరెన్స్ హాల్‌లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగాయి. కా. రవీంద్ర ధనవంత్ హలీంగలి (కర్ణాటక) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ నూతన కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా కా. వినోద్ కుమార్ ఝా (బీహార్) ఎన్నికయ్యారు. మొత్తం 23 మందితో కేంద్ర కమిటీని ఏర్పాటు చేయగా, ఇందులో 7 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు ఉన్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యులుగా కా. రవీంద్ర ధనవంత్ హలీంగలి (కర్ణాటక), కా. లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి (తెలంగాణ–కరీంనగర్), కా. ఎం. వెంకట నరసింగరావు పట్నాయక్ (విశాఖపట్నం–ఆంధ్రప్రదేశ్), కా. ప్రమోద్ కుమార్ (బీహార్)తో పాటు కేరళ, పంజాబ్/ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురు ఎన్నికయ్యారు. కేంద్ర కమిటీ సభ్యులుగా కా. వల్లేపు లక్ష్మీనారాయణ (విజయవాడ), కా. మర్రిపెల్లి మొగిలి (మహబూబాబాద్), కా. చింతలపూడి పవన్‌కుమార్ (గుంటూరు), కా. జహరుద్దీన్ (పశ్చిమ బెంగాల్), కా. జి. వరాహమూర్తిరెడ్డి (విశాఖపట్నం), కా. అక్కల బాపు యాదవ్ (జయశంకర్ భూపాలపల్లి), కా. బుద్ధులాల్ సింగ్ (పశ్చిమ బెంగాల్) తదితరులను ఎన్నుకున్నారు. కేరళ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి మిగతా కేంద్ర కమిటీ సభ్యులను డిసెంబర్‌లో బీహార్‌లో జరిగే కేంద్ర కమిటీ సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.