రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి.
- హజరౌతున్న సిపిఐ జాతీయ సినియర్ నేత మాజీ ఎమ్మెల్యే :చాడ వెంకటరెడ్డి.
- నిజాం ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దే.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
- సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎడల వాణేష్
అక్కన్నపేట : భూమి భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం 1947లో చేసిన ప్రజా పోరాటలతో నిజాం నవాబు భూస్వాముల ఆగడాలను ఎండగట్టి లక్షలాది ఏకరాల భూములను పేదలకు పెంచేందుకు సాగిన విరోచిత పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ ప్రతి ఏటా సాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జరుగుతున్న సందర్భంగా మంగళవారం నాడు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అనభేరి,సింగిరెడ్డి అమలు భవన్ వద్ద నుండి ప్రారంభమయ్యే ర్యాలీ మల్లేచేట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ కూడలి మీదుగా నాగారం మహ్మదపుర్ లో రజాకారు ముకలు చేసిన ఎన్ కౌంటర్ లో అసువులు బాసిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి మరో 10 మంది అమరుల స్మారక స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ సినియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాలా సిపిఐ కార్యదర్శులు మంద పవన్, పంజాల శ్రీనివాస్, కర్రె బిక్షపతి,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ సిపిఐ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ మూడు జిల్లాల సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలాల కార్యదర్శులు నియోజకవర్గ సిపిఐ నాయకులు హజరౌతున్నారని సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాలు నాయకులు, మహిళాలు, కార్యకర్తలు, యువకులు, విద్యార్థులు, సానుభూతి పరులు, రైతులు, కూలీలు, కార్మికులు,హజరై తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎడల వణేష్ పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


