ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
దౌల్తాబాద్, సిద్దిపేట: గాజులపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు గణపురం నర్సింలు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న సందర్భంగా పాఠశాలలో మంగళవారం గ్రామ సర్పంచ్ పంజ స్వామి నర్సింలు సత్కరించారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయులకు ప్రతి ఏటా జిల్లా స్థాయిలో పురస్కారాలు రావడం గర్వకారణమని సర్పంచ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందని నరసింహులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తూ విద్యార్థులు ప్రగతి పథంలో ముందుకు సాగేలా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు నరేందర్, సురేందర్,దేవదాస్ ,ప్రధానోపాధ్యాయుడుత్యాగరాజు, ఉపాధ్యాయులు నవీన్, జ్యోతిర్మయి, రోజా తదితరులు న్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


