మహబూబ్‌నగర్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు
మహబూబ్‌నగర్ అర్బన్: భారతదేశ ప్రఖ్యాత ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లైసెన్సుడ్ సర్వేయర్స్, ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణంలో ఇంజనీరింగ్ రంగానికి అందించిన విశిష్ట సేవలను, ఆయన ఆదర్శాలను స్మరించుకున్నారు. ఆధునిక భారతదేశ అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు ఇంజనీర్లు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ వెంకటయ్య, తోపాటు అసోసియేషన్ అధ్యక్షులు కంచిమి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు కోట్ల చంద్రయ్య, పీర్ మొహమ్మద్ సాదిక్, ఈదే బుచ్చన్న, గంగ శివకుమార్, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కోశాధికారి లక్ష్మయ్యతో పాటు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన పలువురు ఇంజనీర్లు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


