వినాయక చవితి శుభాకాంక్షలు
- విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
- సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు అభివృద్ధి చెందాలి
- బీఆర్‌ఎస్ మండల నాయకుడు, మాజీ ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్
అక్కన్నపేట : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలను రామవరం మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్ మండల నాయకుడు లింగాల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ నవరాత్రులు శ్రీ సిద్ధి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కృపతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వినాయక మండపాల వద్ద భక్తులు, నిర్వాహకులు విద్యుత్ దీపాల అలంకరణ, మైక్ సిస్టమ్ ఏర్పాటు సమయంలో విద్యుత్ తీగల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మండపాల వద్ద భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని లింగాల శ్రీనివాస్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


