ప్రజా సమస్యలను పరిష్కరించండి
డిప్యూటీ కమిషనర్ కి సిపిఐ నాయకులు వినతి
మేడ్చల్ మల్కాజ్గిరి : జగద్గిరిగుట్టలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో అనేక వినతి పత్రాలు ఇస్తే ఇప్పటికీ ఆ కల సాకారమైందని ,ఈ ప్రాంత అభివృద్ధి కోసమే సిపిఐ ఎల్లప్పుడూ పనిచేస్తుందని మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములై జగద్గిరిగుట్టను అభివృద్ధి చేయాలని కోరుతూ నేడు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కి సిపిఐ నాయకులు సన్మానించి జగద్గిరిగుట్ట లో నెలకోన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, రాములు ప్రజానాట్య మండలి అధ్యక్షులు బాబు, యువజన సంఘం కార్యదర్శి కీర్తి సిపిఐ నాయకులు సదానందం, సహదేవరెడ్డి , కే వెంకటేష్, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


