కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని కొలన్ హన్మంత్ రెడ్డి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కుత్బుల్లాపూర్ మాజి మహిళా మండల అధ్యక్షురాలు జి. స్వప్న, గడ్డం గాయత్రి, మమత, రాధ ఉన్నారు. ఈ కార్యక్రమంలో దూలపల్లి డివిజన్ అధ్యక్షులు శివకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఐ ఎన్ టి యు సి , అధ్యక్షులు ఇల్లేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ మండల్ వైస్ ప్రెసిడెంట్ శివాజీ, నాగరాజు, సాయి యాదవ్, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు రామ్ యాదవ్, తిరుపతిరావు, సి.హెచ్. నాగరాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు విజయ్ నాయక్, వెంకటేష్, నవీన్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


