వరిపంట లలో హిస్పా, మొగిపురుగు ఉధృతి,
పంట పరిస్థితిని పరిశీలించి షాహిద్ అలీ ఏ ఓ
మేడిపల్లి (జగిత్యాల) మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో వరి పంటలను మేడిపల్లి మండల వ్యవసాయ అధికారి ఎం.డి. షాహిద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పంటలో హిస్పా, మొగిపురుగు పురుగుల ఉధృతి, పంట పరిస్థితిని పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేశారు. హిస్పా నియంత్రణకు పొలంలో కలుపు మొక్కలను తొలగించి, పొల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. అవసరానికి మించి నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లంబడా సైహలోత్రిఎన్ లేదా ఇమిడక్లోప్రిడ్ మందును పురుగుమందులను మాత్రమే లేబుల్ సూచనల ప్రకారం ఉపయోగించాలి. మొగిపురుగు నియంత్రణకు పంటను క్రమం తప్పకుండా పరిశీలించి డెడ్ హార్ట్స్ లక్షణాలను గుర్తించాలి. పొలంలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన పురుగుమందులను సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైన చోట ఫెరోమోన్ ట్రాప్స్ మరియు ఇతర సమగ్ర పురుగు నియంత్రణ పద్ధతులను వినియోగించాలి. రైతులు పురుగుల ఉధృతి గుర్తించిన వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి, సిఫారసు చేసిన మందులను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తిరుపతి రెడ్డి, రాజు, మాధవ్, లింగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


