అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగ
జిల్లావ్యాప్తంగా అన్నలకు రాఖీలు కట్టిన చెల్లెళ్లు.
సంగారెడ్డి: ఆగస్టు 28: రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధం వెల్లివిరిసింది. చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి, నుదుట తిలకం దిద్ది, స్వీట్లు తినిపించారు. అన్నలు తమ చెల్లెళ్లకు బహుమతులు అందించి జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో ఇళ్లలో, గ్రామాల్లో రాఖీ వేడుకలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేవుళ్ళ కాలం నుండి ఈ రాఖీ బంధం కొనసాగుతుందని గుర్తు చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


