మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ ఆర్థిక సహకారంతో

 గోమయ గణపతుల ఉచిత పంపిణీ  గో సంరక్షణకు చేయూత..

మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ ఆర్థిక సహకారంతో

పర్యావరణ పరిరక్షణకు ‘గోపాల్స్’ వినూత్నం

నాగర్ కర్నూల్ : వినాయక చతుర్థి వేడుకలను పర్యావరణ హితంగా నిర్వహించడంతో పాటు గోసంరక్షణకు చేయూతనిచ్చేందుకు బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో గోపాల్స్ సంస్థ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు.శ్రీ మేకల రాజమల్లయ్య (రాజు) - మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు ఉచితంగా గోమయ గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు.గోమయంతో తయారు చేసిన గణపతుల వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ గోవుల సంరక్షణకు, గోశాలల నిర్వహణకు తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. రసాయన విగ్రహాలకు బదులు సహజసిద్ధమైన గోమయ గణపతులను ప్రతిష్టించాలని కోరారు. సహకారం అందించిన మల్లికార్జున కన్స్ట్రక్షన్స్ వారికి గోపాల్స్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో దాసరి సురేష్, మేకల లక్ష్మీకాంత్, మండలి యాదగిరి, పూరి రాజేష్, లక్ష్మణ్ దాసు తదితరులు పాల్గొన్నారు.

Views: 111

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.