అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.

తమ భూములు ఇప్పించాలని కలెక్టర్ కు విన్నపం.

అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.

హనుమకొండ : తమ భూములను నకిలీ ధ్రువపత్రాలతో కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారని వాటిని రద్దుచేసి తమ భూములు తమకు  ఇప్పించాలని భూబాధితులు జిల్లా కలెక్టర్ ను కోరారు. సోమవారం పరకాల ప్రెస్ క్లబ్ లో  భూ బాధితులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరకాల శివారులోని సర్వే నంబర్ లో గల 682 ,683 ,698 ,195 ,637 ,639 ,640 ,648 ,750 ,751 ,752 ,,746 ,749 ,779 లలోని సొంత భూములను నకిలీ పత్రాలను సృష్టించి కొలగాని భాగ్యమ్మ వద్ద నుండి ఆముదాల రవి , పల్లెని వసంత ,బోద్దిరెడ్డి ప్రియదర్శిని , తక్కలపల్లి రంజిత్ రావ్ , ఎర్రబెల్లి గోపి , వేముల రాధమ్మ , చదువు రమణారెడ్డి , రాహుల్ లు స్థానిక తాసిల్దార్ తో కుమ్మకై పట్టా చేసుకున్నారని రామ్శెట్టి రాజేందర్ ఆరోపించారు. తన తల్లి పేరులో ఉన్న పట్టా భూమిలోని 22 గుంటలు ఉండగా అందులో నుండి 10 గుంటల భూమిని  తన అనుమతి లేకుండా అక్రమంగా పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు 25 ఎకరాల భూమిని పరకాల తహసిల్దార్ ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా పట్టా చేశారని వారు ఆరోపించారు. వాటి విలువ సుమారు బహిరంగ మార్కెట్లో 50 కోట్లుగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అట్టి భూములు తమ తాతైనా కోలగాని నాగయ్యకు చెందినదని రాశెట్టి రాజేందర్ తెలిపాడు.పరకాల శివారులోని భూపాలపల్లి కి వెళ్లే రోడ్డుకు సమీపంలో ఉంటాయని రాజేందర్ తెలిపాడు. కొలగాని నాగయ్యకు నలుగురు కూతుర్లు కాగా వారికి తనకు ఉండబడిన 50 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక్కొక్కరికి సమానంగా పంచుతూ 1972లో నాగయ్య వీలునామా రాశాడు. కొలగాని నాగరాజు కొంతమంది దళారులతో కలిసి ఉండబడిన మొత్తం ఆస్తిని నకిలీ పత్రాలు సృష్టించి కాచేశాడని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇట్టి భూముల వ్యవహారం ఆ కుటుంబాల మధ్య గొడవలు జరిగి కోర్టును ఆశ్రయించారు. కోర్టు వ్యవహారాలలో ఉన్న భూములను తాసిల్దార్ ఆర్డీవో లు అక్రమంగా పట్టా చేయడం ఏమిటని ప్రశ్నించాడు. వ్యవస్థలోని పై స్థాయి అధికారుల సమయంతోనే ఈ వ్యవహారం అంతా సాగిందని బాధితులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి పరకాల తాసిల్దార్ గతంలో ఇక్కడ పనిచేసిన ఆర్డిఓ నారాయణలపై సమగ్రమైన విచారణ చేసి తమకు న్యాయం చేయాలని అదేవిధంగా అవినీతి ప్రక్రియలు భాగస్వాములై తమ భూములను పరాయి వ్యక్తుల పేరును బదిలాయించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రిజిస్ట్రేషన్ ఉన్న బెదిరిస్తున్నారు. పరకాల శివారులోని 698లో గల సుమారు 15 గుంటల వ్యవసాయ భూమిని 2013లో కొని  రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని బాధితుడు లక్కం సురేష్ అన్నాడు. తను పావుసెట్టి రాజధాని వ్యక్తి నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. పావుశెట్టి రాజు రామ్ శెట్టి రాజేందర్ వద్ద నుండి కొనుగోలు చేసి తనకి 2013లో అమ్మగా కొనడం జరిగిందని సురేష్ తెలిపారు. అదే సమయంలో వ్యవసాయ భూమిక కాకుండా వ్యవసాయ యాత్ర భూమిగా మార్చుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. సైతం వారు తనకు తెలియకుండా అక్రమంగా పట్టా చేసుకొని ఆక్రమించుకుంటున్నారని తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ అక్రమ పట్టాదారులు తనను చంపడానికి ప్రయత్నించారని ఆయన బోరుణ వినిపించాడు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. తప్పుడు ఆధార్ కార్డుతో భూమిని కాల్ చేశారు.  తప్పుడు ఆధార్ కార్డును సృష్టించి తన భూమిని కాజేశారని దానికి స్థానిక తహసిల్దార్ కారణమని న్యాయవాది పోరండ్ల రాజయ్య అన్నాడు. తను పట్టణంలోని ముస్లిం వద్ద గత 20 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తనకు భూమి అమ్మిన వ్యక్తి ఎప్పుడూ చనిపోయాడని అలాంటి వ్యక్తిపై కొత్తగా ఆధార్ కార్డును సృష్టించి తన భూమిని కాజేశారని రాజయ్య తెలిపారు. తన భూమికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు తన వద్ద ఉన్నప్పటికీ వాటిని లెక్కచేయడం లేదని ఈ విషయమై తాసిల్దార్ని ఎన్నిసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందన్నారు. తన స్థలంలో నిర్మాణం కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేసినట్లు తాజాగా తెలిపాడు. వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తెలిపాడు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు అన్నారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ మోర్చా నియామకం
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
అన్యాక్రాంతమైన భూములను కాపాడండి.
చౌటకూర్ నుంచి పోసానిపల్లెలో గ్రామంలోని వెళ్తున్న రోడ్డు పక్కన ఉన్న చెట్లను యథేచ్ఛగా చెట్ల నరికివేత
పెండెల రవీందర్‌ను పరామర్శించిన చల్లా..
ఘనంగా ఆదివాసీ దినోత్సవం 
నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం 
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం