బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
కిసాన్ నగర్ ఘటనకు బీజేపీని బాధ్యుల్నిచేయడం దుర్మార్గం - డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వ్యక్తిగత గొడవలను సాకుగా చూపి భారతీయ జనతా పార్టీపై బురద జల్లడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు హెచ్చరించారు.మంగళవారం కరీంనగర్ లోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో విలేకరులతో మాట్లాడుతూ కిసాన్ నగర్ ఘటనను బీజేపీకి అంటగట్టడం దుర్మార్గమన్నారు. గతంలో బీజేపీ కార్పోరేటర్ సోమిడి వేణుపై దాడి జరిగినా తాము ఏ పార్టీపై నిందలు వేయలేదని, దాన్ని వ్యక్తిగతంగానే చూశామని గుర్తు చేశారు.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాననే అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు" అని గంగులకు సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ఈ గొడవలో లాగడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీకి మేయర్ పదవి ఇచ్చినందుకే ఇంత కక్ష సాధిస్తున్నారని ఆరోపించారుబీజేపీ అంటే అభివృద్ధి, దాడుల సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని, అందుకే ప్రజలు మాకు మేయర్ పీఠం కట్టబెట్టారని అన్నారు. 5 నెలలు కూడా గడవని తమ పాలకవర్గంపై ఇంత అసూయ చూపడం సరికాదన్నారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు బండ రమణారెడ్డి, ఓంటెల సత్యనారాయణ రెడ్డి, చొప్పరి జయశ్రీ, మాసం గణేష్, పొన్నం మొండయ్య గౌడ్, బండారి వేణు, కె.ఎ.పి.పి చంద్ర, దేవసాని సత్యనారాయణ, నాంపల్లి శ్రీనివాస్, కర్రె అనిల్, తోట అనిల్, కో ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, చిగురు రవి, నాయకులు పండుగ నాగరాజు, వెంకట్ రెడ్డి, శివ, చంద్రమౌళి, అనిల్, హమీద్ పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:20:25
శివంపేట, (మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముకుల గ్రామానికి చెందిన నారాయణ గారి పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శివంపేట మండల...
