బాలానగర్ డివిజన్‌లో సంజీవయ్య కాలనీలో వినాయకుడి కి పూజలు

బాలానగర్ డివిజన్‌లో సంజీవయ్య కాలనీలో వినాయకుడి కి పూజలు

దర్శించుకున్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్,

మేడ్చల్ మల్కాజ్గిరి :  కూకట్పల్లి 5వ ఫేజ్  బాలానగర్ డివిజన్‌లో గల సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడిని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్  కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్  బండి రమేష్ మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని* ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం  తల్లులకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం 
గంభీరావుపేట  గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడి సెంటర్ లో పోషణ మాసం లో భాగంగా మంగళవారం  హమారీ అంగన్వాడి హమారీ జిమ్మధారి  10...
ఉద్యమకారులను విమర్శిస్తే  పదవులు వస్తుందనుకుంటున్నారా?
మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్‌లో రసవత్తరంగా ఖో-ఖో పోటీలు
కోడిపాక గ్రామపంచాయతీకి రావలసిన పనులు గండి కొడుతున్న ఓ కోళ్ల పరిశ్రమ నోటీసులు జారీ 
మధుర గ్రామంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు 
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేయాలి 
దేవరకొండలో ఘనంగా ‘హైదరాబాద్ విమోచన దినోత్సవ'  వేడుకలు