ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్ : సోమవారం రాత్రి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అగ్ని ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను టీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు.మరణించిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు 50 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటన పై స్పందిస్తూ అధికారుల నిర్లక్షం వల్ల ఘటన జరిగినట్లు,ప్రభుత్వం పై విమర్శలు చేశారు. బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించక పోవడం శోచనీయమన్నారు. వారి వెంట మాజీ మంత్రి బోడా జనార్దన్, టీ ఆర్ ఎస్ జిల్లా ఇంచార్జి రాథోడ్ బాపురావు, పార్టీ అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ రావు, అసెంబ్లీ ఇంచార్జి వేణుగోపాల్ యాదవ్, వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


