మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా పోషణ మాసం 

మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా పోషణ మాసం 

  • పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం 
  • ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

​మర్రిగూడ, :మన అంగన్వాడీ మన బాధ్యత అనే లక్ష్యంతో మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి 'పోషణ మాసము' కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరై మాట్లాడారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు తగిన మోతాదులో ఉండే సమతుల్య ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు తమ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని  ​తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మనకు స్థానికంగా అందుబాటులో ఉండే ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, చిరుధాన్యాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని ఎంపీడీవో మున్నయ్య సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సేవలను గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ సక్కుబాయి అన్నారు.ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, సూపర్‌వైజర్ యశోద, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ బిజిలీపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
శివంపేట(మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలీపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుక్కల పెంటమ్మ అధ్యక్షతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా...
ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన  టీ ఆర్ ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 
మహా అన్నదానం 
మహా గణపతికి కుంకుమార్చన పూజ నిర్వహించిన తేజోమయి రెసిడెన్సి మహిళలు.
బోధన్ లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు
మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా పోషణ మాసం 
వాడివేడిగా మర్రిగూడ మండల సర్వసభ్య సమావేశం!