సహారా ఏజెంట్ పై దాడి చేయడం హెయమైన చర్య

సహారా ఏజెంట్ పై దాడి చేయడం హెయమైన చర్య

భూపాలపల్లి  : ​హనుమకొండలో సహారా కార్యకర్త గడల కుమార్‌పై దాడి హేయమైన చర్య: తోట రాజయ్య ఖండన.​గతంలో ముల్కనూరు సహారా బ్రాంచ్ మేనేజర్‌గా సేవలందించిన గడల కుమార్ గారిపై నిన్న హన్మకొండలో సహారా కార్యకర్త సయ్యద్ గోర తన 10- 15 మంది అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య.తెలంగాణ సహారా ఖాతాదారుల మరియు కార్యకర్తల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ​ఎవరు ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాం. సహారా ఖాతాదారులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి: దయచేసి అందరూ సంయమనం పాటించాలి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఎలాంటి పరిష్కారమూ దొరకదు. అనవసరంగా కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడటం తప్ప రూపాయి ప్రయోజనం ఉండదు. సమస్యలను శాంతియుతంగా, చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలే తప్ప హింసకు తావివ్వకూడదని రాష్ట్ర సహారా సంక్షేమ  సంఘం జెనరల్ సెక్రటరీ రాజయ్య అన్నారు.

Views: 253

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.