వినాయకుడిని దర్శించుకున్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు
సిద్ధిపేట, మర్కుక్ సెప్టెంబర్ 15 :మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో వినాయక చవితి పురస్కరించుకొని మాల వారి సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని మంగళవారం నాడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల బృందం విద్యార్థులతో కలసి దర్శించుకున్నారు.ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు మాట్లాడుతూ చేబర్తి గ్రామ ప్రజలు,పాఠశాలలోని విద్యార్థులుఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని,ఆ గణేశుని అనుగ్రహంతో విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని విద్యార్థులందరితో కలసి దర్శించుకోవడం జరుగుతుందని అన్నారు.వారితో పాటు వినాయక కమిటీ సభ్యులు ర్యాకం కనకయ్య,కొండ బాలకృష్ణ,ద్యాకం సత్యనారాయణ,కొండ బాబు,శమ్మని నర్సింలు,ఎలిమల కర్ణాకర్,కొండ అభి తదితరులున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


