జాతీయ త్రోబాల్‌లో స్వర్ణం..అక్షితకు ఘన సన్మానం
- భారత జట్టుకు ఎంపికై ఏషియన్ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధం
- రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసిన చాకలి శేరిపల్లి సర్పంచ్ మాచర్ల శ్రీశైలం
చింతపల్లి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, చింతకుంట జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతు న్న విద్యార్థిని ఆకుల అక్షిత జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో సత్తా చాటి స్వర్ణ పతకం సాధించి, ఇప్పుడు భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా చింతపల్లి మండలం చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ మాచర్ల శ్రీశైలం అక్షితను ఘనంగా సన్మానించి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గత నెలలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు స్వర్ణ పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. జాతీయ స్థాయిలో ఆమె ప్రదర్శనను గుర్తించిన ఎంపిక కమిటీ భారత త్రోబాల్ జట్టుకు అక్షితను ఎంపిక చేసింది. శ్రీలంకలోని నిగాంబో ఇండోర్ స్టేడియంలో నవంబర్ 19 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఏషియన్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున అక్షిత ప్రాతినిధ్యం వహించనుంది. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అక్షిత చింతకుంట ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని గ్రామస్తులు పేర్కొన్నారు. కళాశాల సిబ్బంది అభినందనలు కళాశాల ప్రిన్సిపాల్ ఎ. లక్ష్మీ, జోనల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పీడీ సుష్మా, పీఈటీ సుజాత, కోచ్ సతీష్తో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు అక్షితను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించి, ఇప్పుడు అంతర్జా తీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం ఎంతో గర్వకారణమని వారు తెలిపారు. శ్రీలంకలో జరిగే ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లోనూ అక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి భారతదేశానికి పతకం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగడాల వెంకటయ్య, ఆకుల ఎల్లమ్మ, శ్రీను, ఉడతల శీను, కేశగోని వెంకటయ్య, పుప్పాల బాలయ్య, యాదయ్య, కొండల్, శ్రీశైలం, పెద్దయ్య, శంకరయ్య, బాలగోని మల్లయ్య, నారయ్య, మైసయ్య, ముత్యాలు, మధ్యలో వెంకటయ్య ఆమ్రిన్ ఆప్రోస్కాన్ అంజయ్య శంకర్ ఉడతల జంగయ్య అబ్బయ్య మారెమ్మ, జంగయ్య, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


