శాయినిపల్లి, ముమ్మాయపల్లి విద్యార్థులకు బంగారు,రజత పతకాలు

శాయినిపల్లి, ముమ్మాయపల్లి విద్యార్థులకు బంగారు,రజత పతకాలు

 నాగర్‌కర్నూల్ / బిజినపల్లి ,: సరూర్‌నగర్‌లో జరిగిన "ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే 2026 ఛాంపియన్షిప్"లో బిజినపల్లి మాస్టర్ జగన్ సెన్సాయి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.శాయినిపల్లి గ్రామానికి చెందిన పి.పరమేశ్వరి గోల్డ్ మెడల్, బాలేశ్వరి సిల్వర్ మెడల్,లిఖిత సిల్వర్ మెడల్ సాధించారు.అలాగే ముమ్మాయపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ గోల్డ్ మెడల్ సాధించాడు. వీరందరూ కటా విభాగంలో 1వ, 2వ, 4వ స్థానాల్లో నిలిచి మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ అందుకున్నారు. ఛాంపియన్షిప్‌కు ముఖ్య అతిథిగా VIP అకాడమీ గ్రాండ్ మాస్టర్ హాజరయ్యారు.జడ్చర్ల నుండి వచ్చిన మాస్టర్ అష్ఫాక్ సెన్సాయి మాస్టర్ సయ్యద్ మరియు బిజినపల్లి మాస్టర్ జగన్ సెన్సాయి శిష్యులు ఈ విజయాలు సాధించడం విశేషం.ఈ సందర్భంగా మాస్టర్ జగన్ మాట్లాడుతూ, "వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. కరాటే అనేది ఆయుధం లేకుండా ఆత్మరక్షణ చేసుకోగలిగే కళ. దీని వల్ల విద్యార్థులకు శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో నిర్వహించి యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తాము" అని తెలిపారు.విజేతలను శాయినిపల్లి గ్రామ సర్పంచ్ కె. శంకర్,ముమ్మాయపల్లి డిప్యూటీ సర్పంచ్ కే.రాము విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఎస్సై గారి చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ విజయంతో గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. గ్రామస్తులు విద్యార్థులు మరియు మాస్టర్ జగన్‌ను అభినందించారు.
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి...
మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...
అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా. 
సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.
బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం