నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు గౌడ సంక్షేమ సంఘం నాయకుల సన్మానం
రాజన్న సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, :ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్. రమేష్ గౌడ్‌ను మండల గౌడ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై రమేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపిన గౌడ సంఘం నాయకులు, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, ఉపాధ్యక్షుడు కోల నారాయణ గౌడ్, బండ లింగంపల్లి సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్, విక్కుర్తి స్వామి గౌడ్, లచ్చపేటకు చెందిన బలరాం గౌడ్, సింగారం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు మల్లేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కిషన్ గౌడ్, రామచంద్రం గౌడ్ తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
11 Aug 2026 16:20:25
శివంపేట, (మెదక్): మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముకుల గ్రామానికి చెందిన నారాయణ గారి పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శివంపేట మండల...
