రేకుర్తిలో భూముల హద్దులపై అయోమయం.!
- 164 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి.. పక్కనే ప్రైవేటు భూమి..
- సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.. నిర్మాణాలపై స్థానికుల అభ్యంతరం
కొత్తపల్లి: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్ రేకుర్తిలో భూముల హద్దులపై స్పష్టత లేకపోవడంతో వివాదం నెలకొంటోందని స్థానికులు పేర్కొంటున్నారు. 164 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెబుతున్నప్పటికీ, దాని పక్కనే ఉన్న భూమి ఎవరి పరిధిలోకి వస్తుందనే విషయంలో స్పష్టత లేదని తెలిపారు. సంబంధిత భూమికి అధికారులు సమగ్రంగా సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూముల హద్దులను స్పష్టంగా గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. అయితే హద్దులపై స్పష్టత లేని పరిస్థితిలో కొందరు వ్యక్తులు సదరు భూమి తమదేనంటూ నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో నిర్మాణ పనులను నిలిపివేసినట్లు స్థానికులు తెలిపారు. తాజాగా మళ్లీ పనులు చేపడుతున్న నేపథ్యంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని సర్వే చేయాలని, రికార్డుల ఆధారంగా హద్దులను నిర్ణయించాలని కోరుతున్నారు. సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


