ప్రభుత్వ ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి 

ప్రభుత్వ ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి 

పెన్ పహాడ్, ( సూర్యాపేట): మండల పరిధిలోని దుబ్బ తండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంతటి త్రివేధ గౌడ్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఒక దాడి ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.ఘటనపై రకరకాల ఊహాగానాలు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం... త్రివేధ గౌడ్ భార్య, పిల్లలు ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో, ఆయన ఒక్కరే ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై దాడికి పాల్పడగా తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించిన పరిసరాల వారు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ కలహాలేమైనా కారణమా లేదా మరేదైనా వివాదమా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు.ఈ ఘటనకు సంబంధించి మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనుమానితులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.సౌమ్యుడిగా, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్న త్రివేధ గౌడ్ అకాల మరణం పట్ల మండల విద్యాధికారి నకిరేకంటి రవి, గ్రామ సర్పంచ్ జేతూ నాయక్,తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు  స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తంచేశారు.

Views: 51

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు రావు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు రావు చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
మేడ్చల్ మల్కాజిగిరి:కూకట్పల్లిలోని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు క్యాంపు కార్యాలయములో  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా  సి.యం. ఆర్ ఎఫ్ ఫండ్స్ ఎల్ ఓ సి  ద్వారా...
ప్రజా సమస్యలను పరిష్కరించండి
గణనాథునికి పూజలు జరిపించిన ఆర్ బీ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి.
ప్రజా సమస్యలను పరిష్కరించండి
గణనాథుడికి ప్రత్యేక పూజలు:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
నాంపల్లిలో భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు