బురదమయంగా మారిన రోడ్డు
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసుల డిమాండ్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు రాజేష్ కుమార్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి (ప్రజ్ఞాపూర్) రోడ్డు అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన చిన్న వర్షానికే ఈ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారడంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై భారీగా బురద పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులు జారి కిందపడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ దారి గుండా నడవలేక నరకయాతన అనుభవిస్తు న్నారు. ఈ విషయమై స్థానిక కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని కాలనీవాసులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించి, యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు గట్టిగా కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


