వినాయక మండపం వద్ద సందడి చేసిన 'ఇరుముడి' చిత్ర ప్రదర్శన!
పెన్ పహాడ్, ( సూర్యాపేట): నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీల హడావిడిలో పాతకాలపు మధురమైన సాంప్రదాయాలు మరుగైపోతున్నాయి. ఒకప్పుడు వినాయక చవితి నవరాత్రులొచ్చాయంటే చాలు, ఊర్లలోని వినాయక మండపాల వద్ద రాత్రిపూట తెరలు కట్టి సినిమాలు ప్రదర్శించేవారు. ఆ జ్ఞాపకాలను మళ్లీ కళ్లముందు సాక్షాత్కరింపజేస్తూ... సోమవారం రాత్రి మండల పరిధిలోని అనంతరం గ్రామంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది!స్థానికముత్యాలమ్మ గుడి ప్రాంగణంలోని వినాయకుని మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై "ఇరుముడి" సినిమాను ప్రదర్శించారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఈ పాతకాలపు ప్రదర్శన పద్ధతిని నేటి తరం కోసం మళ్లీ తీసుకురావడంతో గ్రామస్తుల్లో అంతులేని ఉత్సాహం వ్యక్తమైంది.చిన్నా పెద్దా, ముసలి ముతక తేడా లేకుండా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, సరికొత్త అనుభూతిని ఆస్వాదించడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండపం పరిసరాలన్నీ జనసందోహంతో, కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. సాంకేతికత ఎంత పెరిగినా, అందరూ కలిసి ఒకే చోట కూర్చుని సినిమా చూసే ఆ సామూహిక ఆనందమే వేరని అనంతరం గ్రామస్తులు మరోసారి నిరూపించారు!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


