డీ 86 కెనాల్ కు భిగించిన రైతుల విద్యుత్ మోటార్ల చోరి.

డీ 86 కెనాల్ కు భిగించిన రైతుల విద్యుత్ మోటార్ల చోరి.

చోరి చేసిన గుర్తు తెలియని దుండగులు

ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామ శివారులోని డి 86 కెనాల్ కు వారి పంటలకు సాగునీరు అందించేందుకు బిగించి ఉన్న రైతుల 3 విద్యుత్ మోటార్లు చోరీ జరిగిన సంఘటన  శనివారం వెలుగులోకి వచ్చింది.రైతులు తెలిపిన వివరాల ప్రకారం డీ 86 కెనాల్ పరిసర ప్రాంతంలో  వరి సాగు కోసం ఏర్పాటు చేసుకున్న 3 విద్యుత్ మోటార్ల ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దొంగలించారన్నారు.గత మూడు రోజుల క్రితం మంచినీటి బావి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైరును ఎత్తుకు వెళ్ళిన సంగతి మరువక ముందే ఇలాంటి సంఘటన జరగడం గ్రామంలో కలకలం రేపింది.కెనాల్ వెంట రైతులు పొలాలకు సాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లు పోయిన వారిలో చిన్న కొమిర(బీమరపల్లి)గ్రామానికి చెందిన కాసర్ల రాజి రెడ్డి,సదువు శ్రీనివాస్ రెడ్డి,పెద్ద కొమిర గ్రామానికి చెందిన కేశిరెడ్డి లక్ష్మారెడ్డి లకు చెందిన మూడు మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ఉదయం పూట పొలానికి నీరు పెట్టేందుకు వచ్చిన రైతులకు మోటార్లు కనిపించకపోవడంతో ఆవేదన చెందారు.మోటార్లు చోరీ కావడంతో పంటలకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి చోరీలు జరిగాయని,కెనాల్ పరిసరాల్లో రాత్రివేళ నిఘా లేకపోవడంతో దుండగులు రెచ్చిపోతున్నారన్నారు.వ్యవసాయ మోటార్ల దొంగతనం పై పోలీసులు దృష్టి సారించి,దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణం లో ఉచిత కంటి పరిక్ష శిబిరం   లయన్ అనుగొండ శ్రీనివాసులు డిస్ట్రిక్ విజన్ ఛైర్మెన్  ఆధ్వర్యంలో రామ్ రెడ్డి లయన్స్...
రోస్టర్ విధానాన్ని సవరించాలి 
చౌటకూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోడపట్ల గణేష్ ముదిరాజ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపిక
డీ 86 కెనాల్ కు భిగించిన రైతుల విద్యుత్ మోటార్ల చోరి.
ఏఐటీయూసీలో 104 మంది యువ కార్మికుల చేరిక
యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, హ్యూమటాలజిస్ట్ డాక్టర్ భరత్ ఎ. వస్వని 
కమాన్‌పూర్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.!