అభివృద్ధి పనుల పేరుతో ఓవర్‌లోడ్ టిప్పర్ల బీభత్సం.
- రాత్రింబవళ్లు దూసుకెళ్తున్న వాహనాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు..!
- డస్ట్ గ్రావెల్‌కు పట్టా కట్టకుండానే రవాణా.. కళ్లల్లో దుమ్ముతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..!
- కొత్తగా వేసిన రోడ్లు పది రోజులు కాకముందే ధ్వంసం.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు..!
- ఓవర్‌లోడ్ వాహనాలపై చర్యలు ఎప్పుడంటున్న ప్రజలు..!
చింతకాని: అభివృద్ధి పనుల పేరుతో మండలంలోని పలు గ్రామాల మీదుగా లారీలు టిప్పర్లు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు తిరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇంత భారీ బరువుతో వాహనాలు నిరంతరం తిరగడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు డస్ట్ గ్రావెల్‌ను వాహనాల్లో తరలించే సమయంలో కనీసం పట్టాలు కట్టకుండా రోడ్లపైకి తీసుకువస్తున్నారని దీంతో గాలి వీచినప్పుడు దుమ్ము ధూళి ఎగిరి వాహనదారుల కళ్లల్లో పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతాంగం వాపోతోంది కళ్లల్లో దుమ్ము పడటంతో ద్విచక్ర వాహనదారులు ఒక్కసారిగా వాహనాలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డస్ట్ రవాణాలో కనీస భద్రతా చర్యలు పాటించకపోవడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రహదారులు అధిక బరువుతో తిరుగుతున్న వాహనాల కారణంగా నాణ్యత కోల్పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా నిర్మించిన రోడ్లు పట్టుమని పది రోజులు కూడా గడవకముందే భారీ వాహనాల రాకపోకలతో దెబ్బతింటున్నాయని వాహనదారులు రైతాంగం ప్రజాప్రతినిధులు చెబుతున్నారు ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలతో వాటి ప్రయోజనం లేకుండా పోతోందని వారు అంటున్నారు ఇంత భారీ స్థాయిలో ఓవర్‌లోడ్ వాహనాలు రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి చింతకాని పోలీస్ అధికారులు సైతం భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు గతంలో కూడా భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు జరిగిన ఘటనలను గుర్తుచేస్తున్న గ్రామస్తులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి చింతకాని మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీ యజమానులు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు డస్ట్ గ్రావెల్‌ను పట్టాలు కప్పి మాత్రమే రవాణా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రహదారులను కాపాడేందుకు నిర్దేశిత బరువు పరిమితిని కచ్చితంగా అమలు చేయడంతో పాటు వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వాహనదారులు రైతాంగం ప్రజలు కోరుతున్నారు...
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


