అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం

అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం

వికారాబాద్,: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ప్రైవేట్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులంతా పటాన్‌చెరు మండల పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన వారిగా తెలిపారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకు న్నట్లు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎమ్మెల్యే జిఎంఆర్‌ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన వారిని వెంటనే కార్పొరేట్‌ ఆసుపత్రుల కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. అనంతగిరి ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, ప్రమాదానికి కారణమైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం