గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన

గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన

చౌటకూర్ : మండలంలోని ఉప్పరగూడెం, వెండికోల్ తదితర గ్రామాల్లో శుక్రవారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలకు ఎంపీడీవో కె. శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనులు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ.. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.అలాగే వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ప్రతి పంటకు ఫామ్‌ పాండ్లు (వ్యవసాయ నీటి గుంతలు) ఏర్పాటు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న సమయంలో పంటలకు నీటి కొరత ఏర్పడకుండా ఫామ్‌ పాండ్లలో నిల్వ చేసిన నీరు ఉపయోగపడుతుందని వివరించారు. వర్షపు నీటిని సంరక్షించుకోవడం ద్వారా భవిష్యత్‌లో నీటి సమస్యలను కొంతవరకు అధిగమించవచ్చని పేర్కొన్నారు.గ్రామాల్లో వర్షపు నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, కాలువల నిర్వహణ, గ్రామాభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఉప్పరగూడెం సర్పంచ్ గొల్ల మల్లేశం, వెండికోల్ సర్పంచ్ మల్లారెడ్డి, ఉపసర్పంచ్ భాస్కర్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, మల్లేశం తదితరులు హాజరయ్యారు. గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి