లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం
నారాయణ పేట జిల్లా, మక్తల్ పట్టణం లో ఉచిత కంటి పరిక్ష శిబిరం లయన్ అనుగొండ శ్రీనివాసులు డిస్ట్రిక్ విజన్ ఛైర్మెన్ ఆధ్వర్యంలో రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రి ఎనుగొండ మహబూబ్నగర్ వారి సహకారంతో ఉచిత కంటి శస్త్ర చికిత్స పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగినది. ఇట్టి శిబిరంలో శ్రీమతి జ్యోతి 120 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో మందికి ఉచిత కంటి ఆపరేషన్ కొరకు మహబూబ్నగర్ రామిరెడ్డి లైన్స్ కంటి ఆసుపత్రికి ఉచిత బస్సులో పంపడం జరిగింది.వారికి ఉచిత భోజన వసతి సదుపాయాలతో ఆపరేషన్ చేసి ఉచితంగా బస్సులో అక్టోబర్ 4వ తేదీ నాడు మక్తల్ కు తిరిగి పంపడం జరుగుతుందని లైన్ సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు టి. నాగరాజు, కార్యదర్శి ఎస్ రమేష్ రావు, కోశాధికారి బి అంబాదాసు రావు, లైన్ సభ్యులు డాక్టర్ శ్రీరామ్ డిస్ట్రిక్ట్ ఇన్నర్ క్యాబినెట్ మెంబర్ సత్య ఆంజనేయులు,డి. వి చారి,కె. పాపిరెడ్డి , కట్ట వెంకటేష్, రవికుమార్ గౌడ్,వాదిరాజ్ రమేష్,అంజన్ ప్రసాద్ పాల్గొనడం జరిగినది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


