మాజీమంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి కి ఘన నివాళులు

మాజీమంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్ర రెడ్డి కి ఘన నివాళులు

ఆదిలాబాద్ :జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో చిల్కూరి లక్ష్మారెడ్డి, అల్లూరి సంజీవరెడ్డి నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ శ్రీ చిలుకూరి రామచంద్ర రెడ్డి  చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సంజీవరెడి, చిలుకూరి లక్ష్మారెడ్డి, మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు  సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, డీసీసీ జనరల్ సెక్రటరీ  సంజయ్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి, రుక్మ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News