ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం

ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం

  • మహిళలు , చిన్నారుల భద్రత సురక్షత ముఖ్యం.
  •  జనవరి 2026 నుండి  సెప్టెంబర్  2026 వరకు ఆకతాయిల వేధింపుల పై ప్రత్యేక దృష్టి సారింపు.
  •  దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషిoచనున్న షీ టీం బృందం
  •  మహిళలను వేధించిన , మహిళల సమస్యల కై అందుబాటులో నిజామాబాదు షీ టీం
  •  416 అవగాహన కార్యక్రమాల నిర్వహణ
  •  1,027 సార్లు హాట్స్పాట్ ల తనిఖీలు
  •  161 ఈ పెట్టి కేసుల నమోదు
  •  61 కౌన్సిలింగ్ లు నిర్వహించి సమస్య పరిష్కారం పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ : ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాదు షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్. తెలియజేశారు.  నిజామాబాదు జిల్లాలో మహిళలు ,చిన్నారుల భద్రతకై , రక్షణకై నిజామాబాదు జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల రక్షణకై విధులను నిర్వర్తిస్తుందని , ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా  ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధించిన సందర్భాలలో రెడ్ హ్యాండెడ్ గా జనవరి  2026 నుండి  సెప్టెంబర్  2026 వరకు 154 కేసులు నమోదు చేసినట్లు , షీ టీం బృందం ప్రత్యేకంగా రాత్రి సమయాలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించిందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు షీ టీం బృందాలు యువతులకు , విద్యార్థిని విద్యార్థులకు , పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 416 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచడం జరుగుతుంది. ఈ సందర్భంగా షీ టీం బృందాల ద్వారా 161 ఈ పెట్టీ కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. షీ టీం బృందాలు జిల్లా వ్యాప్తంగా 1,027 హాట్స్పాట్ల లో తనిఖీ చేయడం జరిగింది , పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. షి టీం బృందం సభ్యులు చాకచక్యంగా వ్యవహరిస్తూ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేక బృందంచే మహిళలకు రక్షణగా , మహిళలు వేధింపులకు గురికాకుండా అడ్డుపడుతూ ఆకతాయిల పట్ల చట్టపరంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు. 61 కౌన్సిలింగ్ ల ద్వారా కేసులలో పరిష్కారం చూపబడింది అని తెలిపారు. ఆపత్కాల సమయంలో నిజామాబాద్ షి టీం బృందాల ను సంప్రదించాలంటే 8712659795 నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. 59 గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించి మహిళల పట్ల జరిగే నేరాలపై , చైల్డ్ మ్యారేజ్ , సైబర్ నేరాలపై , సోషల్ మీడియా నేరాలపై , చిన్నారులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనలు కల్పించి చైతన్యపరచడం జరిగిందని తెలియజేశారు. మహిళల సమస్యలతో దాదాపు 62 మొబైల్ ఫోన్ కాల్స్ వచ్చినట్లు వారికి తగిన సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. మహిళలకు , చిన్నారులకు రక్షణగా నిజామాబాదు పోలీస్ వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని హామీ ఇచ్చారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం