ఏఐటీయూసీలో 104 మంది యువ కార్మికుల చేరిక
నస్పూర్(మంచిర్యాల): సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 గని పరిధిలో పనిచేస్తున్న 104 మంది యువ కార్మికులు ఏఐటీయూసీ సంఘంలో చేరారు. శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య నూతనంగా చేరిన కార్మికులకు కండువాలు కప్పి సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సీతారా మయ్య మాట్లాడుతూ... యువ కార్మికులను సంఘటితం చేయడం ద్వారా కార్మిక హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వీరభద్రయ్య, సమ్మయ్య, బాజీ సైదా, కిషన్ రావు, కొమురయ్య, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


