వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ దాడులు

వీర్నపల్లి మండలంలో ఎక్సైజ్ దాడులు

3 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఒకరి అరెస్ట్

ఎల్లారెడ్డిపేట,: ప్రత్యేక డ్రైవ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎక్సైజ్, సిరిసిల్ల డీటీఎఫ్ బృందాలు వీర్నపల్లి మండలంలోని రాసిగుట్ట తండా, గోలియా నాయక్ తండా, బంజరి తండా, భూక్య తండాల్లో శనివారం సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. రాసిగుట్ట తండాలో రెండు నాటుసారా కేసులను గుర్తించిన అధికారులు ఒకరిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 3 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్ల పులియబెట్టిన బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ విజేందర్ రెండ్ల, హెడ్ కానిస్టేబుల్ బాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వర్మ, మహేష్, శ్రవణ్, యుగేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News