ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ నాగప్ప మృతి పార్టీకి తీరని లోటు

ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ నాగప్ప మృతి పార్టీకి తీరని లోటు

కుటుంబాన్ని పరామర్శించిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

పాపన్నపేట, : పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపురం గ్రామానికి చెందిన బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ మాలిస్‌.నాగప్ప అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు,మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి.తిరుపతిరెడ్డి ముద్దాపురం గ్రామానికి వెళ్లి నాగప్ప భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈసందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మాలిస్‌ నాగప్ప పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈకార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్లు సాతెల్లి బాలగౌడ్‌, పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, పాపన్నపేట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలీస్‌ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు వడ్ల కుబేరుడు,సర్పంచ్ సాయిరెడ్డి,మాజీ సర్పంచ్ లు లింగారెడ్డి,శ్రీనాథ్ రావు,ఏడుపాయల మాజీ డైరెక్టర్లు ఆంటోనీ, ప్రభుగౌడ్‌, గౌరీశంకర్‌, శ్రీనివాస్ రావు,మంద నాగయ్య,బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు దుర్గయ్య,బాబాగౌడ్‌, అనిల్‌రెడ్డి,బీస గోపాల్‌, వినయ్‌,మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కసిరెడ్డి మాణిక్యరెడ్డి,నాయకులు చంద్రమోహన్‌గౌడ్‌, కిరణ్‌గౌడ్‌,గంజి నవీన్‌, నైముద్దీన్‌,తలారి సంతోష్‌,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 64

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి