నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 

నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 

మంచిర్యాల :ద్విచక్ర వాహనం కు నంబర్ ప్లేట్ లేకుండా నడిపితే చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు  మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స్ చౌరస్తా, ముఖరం చౌరస్తా, మార్కెట్ ఏరియా తోపాటు జిల్లా వ్యాప్తంగా అర్ముడ్ పార్టీలతో కలిసి నాకా బంది చేపట్టారు. షాపింగ్ మాల్, దుకాణలు,బ్యాంక్ లు,నగల షాపులు,వివిధ కూడళ్ళలో ఎలాంటి నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నిలిపి వచ్చి పోయేవారిని గమనిస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారని అలాంటి వారిని గుర్తించేందుకు ఈనాకాబంది దోహదపడుతుందని పేర్కొన్నారు. యువత కూడ ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతుంటారని, ఇకపై ఎవరైన సరే వాహనాలకు నంబర్ ప్లేట్, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబందించిన ధ్రువ పత్రాలు లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ నాకా బంది లో పట్టణ సిఐ ప్రమోద్ రావు, ఎస్ ఐ. మధుసూదన్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News