ఫత్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఫత్లాపూర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఫత్లాపూర్, : సత్యమే ఆయుధంగా… అహింసే మార్గంగా… శాంతి, సహనం, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఫత్లాపూర్ గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ స్మృతికి గ్రామ ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పద్మ, సర్పంచ్ పద్మిని, ఉపసర్పంచ్ రాజుకుమార్, వార్డు మెంబర్ మల్లికార్జున్, గైని మారుతీ, గంగాధర్, ఏఎన్‌ఎం సుశీల, అంగన్వాడీ కార్యకర్తలు సునీత, శోభ, యువకులు జాదవ్ శ్రీనివాస్, నిరుడి కిరణ్ కుమార్, సంగమేశ్వర్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి పద్మ మాట్లాడుతూ గ్రామంలో చేపడుతున్న స్వచ్ఛత కార్యక్రమాలు, ఉపాధిహామీ పథకం పనులు తదితర అంశాలపై గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, బోర్ రీచార్జ్ పనులు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన గ్రామాన్ని నిర్మించుకోవచ్చని వివరించారు.అలాగే గ్రామ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్న వనరులు, అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పలు కార్యక్రమాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టే పనులను సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రామ సభలో సమస్యలపై చర్చగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు పలు సమస్యలను ప్రజాప్రతినిధు లు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి వసతులు, గ్రామ పరిశుభ్రత, అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మాణం వంటి అంశాలపై గ్రామస్తులు సమస్యలను వివరించారు.గ్రామస్తులు తెలిపిన సమస్యలను సర్పంచ్ పద్మిని గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు.గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామాభివృద్ధి స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొని గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Views: 62

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి