మంచిర్యాలలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

మంచిర్యాలలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

మంచిర్యాల టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు జనసైనికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు నల్లతీగల మహేష్, ఆవుల సాగర్, పిట్టల సుధాకర్, మేకల పవన్, అర్చనపల్లి చరణ్, ఎం.డి. మజీద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి