వెండికోలు గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

వెండికోలు గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి – ఎంపీడీవో శంకర్ పిలుపు

చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని వెండికోలు గ్రామంలో గ్రామసభతో పాటు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.అనంతరం నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ.. ఎల్-నినో ప్రభావం వల్ల వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ జల సంరక్షణ చర్యలుచేపట్టాలని సూచించారు.ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతిపాదించిన పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంత (సోక్ పిట్) ఏర్పాటు చేసుకోవాలని, అలాగే రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్స్ (పంట కుంటలు) నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారానే భూగర్భ జల మట్టాన్ని పెంచవచ్చని, ఇది భావి తరాలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామని, ప్రజలు వీటి ద్వారా ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలను విజయవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్, వార్డ్ మెంబర్లు,స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి