చౌటకూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోడపట్ల గణేష్ ముదిరాజ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపిక
మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు నియామకం..
హర్షం వ్యక్తం చేస్తున్న ముదిరాజ్, బీసీ వర్గాల ప్రతినిధులు
చౌటకూర్ మండల కేంద్రంలో నూతనంగా మండల కాంగ్రెస్ పార్టీ బోడపట్ల గణేష్ అధ్యక్షుడిగా ముదిరాజ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపిక కావడంతో ముదిరాజ్, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు నూతన మండల అధ్యక్షుడి ఎంపిక జరగడం పట్ల బీసీ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.ఈ సందర్భంగా ముదిరాజ్ బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మండల స్థాయిలో కీలక బాధ్యత అప్పగించడం తమ వర్గానికి ప్రాధాన్యత లభించినట్లుగా భావిస్తున్నామని తెలిపారు.మండలంలోని ముదిరాజ్, బీసీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన అధ్యక్షుడిని వారు కోరారు. బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే నూతన మండల అధ్యక్షుడి ఎంపిక అనంతరం మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేసినట్లు నాయకులు తెలిపారు. మండలంలోని బీసీ వర్గాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు పేర్కొన్నారు.చౌటకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అప్పగించడం పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


