ఆదిలాబాద్ జిల్లా,లో ప్లాట్ పేరుతో మోసం..
- నకిలీ పత్రాలతో బ్యాంకు ఋణం
- ఆదివాసి బాధితున్ని 67.20 లక్షల మోసం
ఆదిలాబాద్ : ముగ్గురిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదు, ప్రధాన నిందితుడు అరెస్టు, రిమాండ్. ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 3( విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ప్లాట్ కొనుగోలు పేరుతో మోసం చేసి, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి, బ్యాంకు రుణం పొందినట్లు ఫిర్యాదు రావడంతో ముగ్గురు వ్యక్తులపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
నిందితులు:
1. గటిక లక్ష్మణ్ స్వామి, s/o నర్సింలు, సంజయ్‌నగర్.
2. గటిక క్రాంతి కుమార్, s/o గటిక లక్ష్మణ్ స్వామి.(అరెస్టు, రిమాండ్)
3. తోకల నరేష్, ప్రస్తుత కౌన్సిలర్. (పరారీ)నిందితులు ఎల్‌బీఎస్ నగర్‌లో ప్లాట్ ఉందని ఫిర్యాదుదారుడు మడావి గోపాల్ ను నమ్మించి, ప్లాట్ కొనుగోలు మరియు ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు రుణం ఇప్పిస్తామని చెప్పినట్లు తెలిపారు. అనంతరం ప్లాట్ నంబర్ 37, సర్వే నంబర్ 45కు సంబంధించిన స్థలాన్ని నకిలీ పత్రాల ద్వారా ఫిర్యాదుదారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా రూ.53.50 లక్షల రుణం పొందించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు, నిర్మాణ సమయంలో రుణం సరిపోదంటూ అదనంగా రూ.13.70 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. 1987 సంవత్సరంలో రామేశ్వర్ అనే వ్యక్తి కొనుగోలు చేసి ఉండడంతో, అదే ప్లాట్ ని నిజాన్ని దాచిపెట్టి బాధితునికి విక్రయించి మోసానికి పాల్పడడం జరిగింది. ఇల్లు పూర్తి అయి గృహప్రవేశం చేసే సమయానికి నిజం యజమాని అధికారుల సమక్షంలో ఈ ఇంటిని జప్తు చేయడం జరిగింది. 2026 ఆగస్టులో మున్సిపల్ అధికారులు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం తనకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై నిందితులను ప్రశ్నించేందుకు ఫిర్యాదుదారుడి కుమారుడు, సోదరుడు తదితరులు వెళ్లగా, వారిని కులం పేరుతో దూషించి, చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆదిలాబాద్ డిఎస్పీ తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు రుణం, నిర్మాణ అనుమతులు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

