పిల్లల భద్రతకు యాజమాన్యం చొరవ చూపాలి 

పిల్లల భద్రతకు యాజమాన్యం చొరవ చూపాలి 

  • బోథ్ మండలంలోని అన్ని పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టాలి
  • కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలపాటి అచ్యుతానంద రెడ్డి

ఆదిలాబాద్ డెస్క్  : బోథ్ మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలపాటి అచ్యుతానంద రెడ్డి తెలిపారు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  చిన్నపిల్లలను బెదిరించడం, అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీ యం కాదని అన్నారు. ముఖ్యంగా ప్రాథమిక తరగతుల పిల్లలను ప్రేమతో, ఓర్పుతో బోధిస్తూ, వారి ఆత్మవిశ్వాసం, మానసిక వికాసానికి అనుకూలమైన వాతావరణాన్ని పాఠశాలలు కల్పించాలని ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బోథ్ మండలంలోని ప్రతి పాఠశాలలో శాశ్వతమైన పిల్లల భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు పిల్లలపై శారీరక శిక్షలు, బెదిరింపులు, అవమానకర ప్రవర్తనను పూర్తిగా అరికట్టి, ప్రతి పాఠశాలలో “చైల్డ్ సేఫ్టీ కమిటీ, ప్రత్యేక ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలి. క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్” నిర్వహిస్తూ పిల్లల చదువు, భద్రత, మానసిక స్థితిపై చర్చించాలి. ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలు, అవసరమైన వెరిఫికేషన్‌ను పర్యవేక్షించడంతో పాటు, CCTV, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాల భద్రతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించడంతో పాటు, పిల్లల మానసిక ఆరోగ్యం మరియు కౌన్సిలింగ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలను పాఠశాలకు పంపినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత పూర్తికాదని, వారు సురక్షితంగా, సంతోషంగా, గౌరవంగా చదువుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం