బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
హుస్నాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని బీజేపీ చేపట్టిన పీఎం సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయ పరిసరాల్లో శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ పిలుపు మేరకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు భూక్యా సంపత్‌నాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గడ్డి, చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా సంపత్‌నాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సమాజహిత సేవా కార్యక్రమాల్లోనూ బీజేపీ శ్రేణులు ముందుంటాయని తెలిపారు. పీఎం సేవా సంకల్ప అభియాన్ ద్వారా సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి తిరుమలరెడ్డి, మండల ప్రభారీ తోట స్వరూప, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోట సమ్మయ్య, నాయకులు బైరి అరుణ్, తడిసిన రమేష్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, సొల్లు రజినీకాంత్, తగరం లక్ష్మణ్, ఇటిక్యాల కుమారస్వామి, పెనాల శ్రీనివాస్, నారోజు నరేష్, బోనగిరి రవీందర్, సిరికొండ రమేష్, కొలిపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


