అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్

  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
  • వైద్య ఖర్చులకు రూ.2 లక్షల చెల్లింపు

పటాన్‌చెరు, : అనంతగిరి బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వికారాబాద్‌లోని ఈషా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్‌చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన క్షతగాత్రులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు.ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యానికి రూ.2 లక్షలు చెల్లించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సేవలను అందించాలని, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు.అవసరమైన వైద్య ఖర్చులను తానే భరిస్తానని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మనోధైర్యం కల్పించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News