మానసిక, శారీరక దృఢత్వాన్ని క్రీడల వల్ల సాధించవచ్చు

మానసిక, శారీరక దృఢత్వాన్ని క్రీడల వల్ల సాధించవచ్చు

  • ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్.*ఏ ఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి 
  • ఆటల నందు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండి పాల్గొనాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ 
  • అట్టహాసంగా వార్షిక జిల్లా పోలీసు క్రీడలు ప్రారంభం.
  • వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచిన జిల్లా జిల్లా ఎస్పీ, అధికారులు.

ఆదిలాబాద్ : అనునిత్యం పోలీసు విధులలో నిరంతరం పనిలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు ఆటవిడుపుగా జిల్లా స్థాయి పోలీసు వార్షిక క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఏ ఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అధికారులతో కలిసి  పాల్గొని పోలీసు క్రీడలను ప్రారంభించారు. మొదటగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  తెలిపారు. తదుపరి పరేడ్ మైదానం నందు రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి ఆధ్వర్యంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని 6 బృందాలుగా ఉన్నటువంటి విక్టర్స్, టైటాన్స్, వారియర్స్, టైగర్స్, గ్లాడియేటర్స్, రాయల్స్  లుగా ఉంటూ చక్కటి పరేడ్ ను నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనాన్ని అందజేయడం జరిగింది. తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు తెలియజేస్తున్నటువంటి ముఖ్య అతిథులు అందరితో కలిసి శాంతి కపోతాలను, బెలూన్లను గాలిలోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాజ్యోతిని క్రీడాకారులైనటువంటి వారు పరేడ్ మైదానం చుట్టూ తిరిగి ముఖ్య అతిథులకు అందజేయగా వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం అదనపు ఎస్పి పి మౌనిక  క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ మొదటగా క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ప్రతిరోజు నిర్వహించే పోలీసు విధులు అయినటువంటి బందోబస్తులు, క్రైమ్ డిటెక్షన్లు, ఉద్యోగం, లాంటి విధులకు ఆటవిడుపుగా ఇలాంటి పోలీసు క్రీడా పోటీలు నిర్వహిస్తారని వాటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధులలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి పోటీల్లో పాల్గొని సిబ్బంది తమ తీయటి గుర్తులను వచ్చే సంవత్సరం వరకు గుర్తుచేసుకోవచ్చు అని తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ పోలీసులు అనునిత్యం వివిధ రకాలైనటువంటి విధులలో నిమగ్నమై ఉంటారని వాటిని మరచిపోతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య ఈ వార్షిక క్రీడల పోటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా తెలిపారు. పోలీసుల ప్రతి రోజు శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నియంత్రణ మరియు పరిశోధన, బందోబస్తులు ఇలాంటి విధులలో నిమగ్నమై ఉంటారని వారందరూ ఎలాంటి క్రీడలలో పాల్గొనడం వల్ల మంచి క్రీడా స్ఫూర్తి పెరగడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసులకు మంచి పేరు కీర్తి ప్రతిష్టలు రావడానికి ప్రతి ఒక్కరు చేసిన కృషిని అభినందిస్తూ ప్రతి ఒక్క పోలీసు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. తదుపరి 800 మీటర్స్, 400 మీటర్స్ పరుగు క్రీడలను అధికారులు అందరితో కలిసి ప్రారంభించారు, గెలిచిన సిబ్బందికి మెడల్స్ ను అందజేసి అభినందించారు. వాలీబాల్ క్రికెట్ క్రీడలను జిల్లా ఎస్పీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించి ఉత్సాహపరిచారు. ముఖ్యంగా ఈ క్రీడలు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు అందులో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాట్మెంటన్, అథ్లెటిక్స్, క్యారం, చెస్ లాంటి వివిధ అంశాలలో ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
🔹800 మీటర్స్ పురుషుల పరుగు విజేతలు. 
1. జె రమేష్, 
2. ఎం నగేష్. 
3. జె సతీష్,
🔹 400 మీటర్స్ మహిళల పరుగు విజేతలు. 
1. పి పూజ, 
2. టి మల్లేశ్వరి, 
3. సిహెచ్ శిల్ప 
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, పిఓ ఐటిడిఎ మంద మకరందు ఐఎఎస్, ఉట్నూర్ సబ్ కలెక్టర్ కె ప్రణయ్ కుమార్ ఐఎఎస్, అదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్, ఆదిలాబాద్ ఎఫ్డిఓ ప్రథమేష్ ఐఎఫ్ఎస్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష,మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, లైబ్రరీ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, పోలీసు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా  ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం...
నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే చర్యలు తప్పవు 
అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అంగన్వాడీ సిబ్బంది సేవలకు ఘన సన్మానం
జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర విచారం