ఆశ్రమ పాఠశాలలో పీఓ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల సమస్యలపై ఆరా
నల్లబెల్లి, (వరంగల్ జిల్లా): మండలంలోని మూడుచెక్కలపల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న వసతులు, పరిసరాల పరిశుభ్రత, భోజన వసతులను పరిశీలించారు.
తరగతి గదులు, లైబ్రరీ, సైన్స్ ల్యాబొరేటరీలను పరిశీలించిన పీఓ.. విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. భోజన మెనూ అమలు తీరును కూడా సిబ్బందిని అడిగి తెలుసుకు న్నారు.10వ తరగతి విద్యార్థులతో పీఓ స్వయంగా మాట్లాడి వారి విద్యాభ్యాసం, చదువులో ఎదురవుతున్న సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీటీడీవో ఏ. నారాయణ రెడ్డి, ఏసీఎంవో ఎం. శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ బి. దేవుల, ప్రధానోపాధ్యాయులు బి. రామయ్య, డిప్యూటీ వార్డెన్ శ్రీమతి జె. వీరమ్మ, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


