యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, హ్యూమటాలజిస్ట్ డాక్టర్ భరత్ ఎ. వస్వని
నిజామాబాద్, యశోద హాస్పిటల్‌లోని క్యాన్సర్ విభాగం రోగుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన, సమగ్ర క్యాన్సర్ చికిత్సలను అందిస్తుందని యశోద ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజిస్ట్, హ్యూమటాలజిస్ట్ డాక్టర్ భరత్ ఎ. వస్వని అన్నారు . శనివారం జిల్లాకేంద్రంలోని యశోద సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక పరీక్షల ద్వారా ప్రతి రోగికి సరైన చికిత్స ప్రణాళికను తయారు చేస్తామన్నారు.క్లిష్టమైన కేసులను వివిధ విభాగాల నిపుణులైన వైద్యులతో కలిసి చర్చించి, ఉత్తమ చికిత్సను నిర్ణయిస్తామన్నారు . కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, కార్ -టీ సెల్ థెరపీ వంటి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.క్యాన్సర్‌కు సంబంధించిన అత్యవసర పరిస్థితులను కూడా నిర్వహిస్తామని వెల్లడించారు . రోగుల సౌకర్యం కోసం డే-కేర్ కీమోథెరపీ సేవలు అందిస్తామని,అవసరమైనప్పుడు రోబోటిక్ సర్జరీ, హిపేక్ వంటి ఆధునిక చికిత్సలు కూడా అందిస్తామన్నారు..ఆధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సహకారంతో ప్రతి క్యాన్సర్ రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్స అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ శ్రీరాం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


